Homeతెలంగాణప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలి…

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి

నిజామాబాద్, జూలై 06 : పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి సూచించారు.

ఎస్ఐఆర్ పురోగతిపై సోమవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీఎల్ఓలు, సూపర్వైజర్లు ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ అర్హులైన ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని మంగళవారం లోపు పూర్తి చేయాలని సూచించారు.

ఎన్యూమరేషన్ ఫారాలను పూరించే విషయంలో ఓటర్లకు సహకరించేలా పట్టణ ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, వివరాల డిజిటలైజేషన్ సమాంతరంగా జరిగేలా చూడాలన్నారు. ముఖ్యంగా బీఎల్ఓ సూపర్వైజర్లు ఎన్యూమరేషన్ ఫారంల స్క్రూటినీలో అప్రమత్తంగా ఉంటూ కీలకంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారంపై ఓటరు సంతకం, లేటెస్ట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, బీఎల్ఓ సంతకం ఉందా లేదా అన్నది క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. కాగా, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను కూడా నిర్ణీత గడువు లోపు పూర్తి చేసి వివరాలు పంపాలన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు అందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 96 శాతం పూర్తయిందని, నిజామాబాద్ అర్బన్ లో కూడా మంగళవారం వరకు పూర్తి చేస్తామని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఓటర్లకు సహకరించేలా నిజామాబాద్ నగరంలో సర్కిల్ వారీగా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశామని అన్నారు. ఓటర్ల నుండి ఎన్యూమరేషన్ ఫారంల సేకరణ జరుపుతూ డిజిటలైజ్ చేయిస్తున్నామని, ఇప్పటికే 16శాతం పూర్తయ్యిందని సీ.ఈ.ఓ దృష్టికి తెచ్చారు.

కాగా, ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని నిర్ణీత గడువు లోపు పూర్తి చేయడంలో బీఎల్ఓ సూపర్వైజర్లు, ఏఈఆర్ఓలు అంకిత భావంతో కృషి

చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ భుజంగరావు, సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డీపీఓ శ్రీనివాస్ రావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు…

0
ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు...  ఏ గణేష్ పటేల్ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ పోతంగల్ ఆగస్టు 26: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో బుధవారం రోజున ముస్లిం సహోదరులు...

మరుగుతున్న మహాసముద్రం…

0
మరుగుతున్న మహాసముద్రం 'ఎల్ నినో'తో పొంచి ఉన్న పెను ముప్పు ప సిఫిక్ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.6 డిగ్రీలుగా నమోదు 1877 రికార్డు బద్దలుకొడుతూ గరిష్ట ఉష్ణోగ్రతలు వాతావరణ సమతుల్యత భారీగా గతితప్పే...

వీధి కుక్కలతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సర్పంచ్ చలిమెల శ్రీనివాస్…

0
వీధి కుక్కలతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సర్పంచ్ చలిమెల శ్రీనివాస్.. త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామంలో వీధి కుక్కల బెడద నేపథ్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...

ధర్పల్లిలో పిచ్చికుక్కల బీభత్సం.. చిన్నారులు, వృద్ధులకు కాట్లు…

0
ధర్పల్లిలో పిచ్చికుక్కల బీభత్సం.. చిన్నారులు, వృద్ధులకు కాట్లు త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో పిచ్చికుక్కల బెడద రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది. వీధుల్లో గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు...

ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాల ముఠా అరెస్ట్…

0
ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాల ముఠా అరెస్ట్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో పలు ట్రాన్స్‌ఫార్మర్ చోరీలకు పాల్పడిన ఆరుగురు నిందితులు అరెస్ట్.. కాపర్ కాయిల్స్, వాహనాలు, చోరీకి ఉపయోగించిన...

Translate »
error: Content is protected !!