ఏవీఎన్‌ఎల్‌లో ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగాలు…
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్మ్‌డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ (ఏవీఎన్‌ఎల్) దేశవ్యాప్తంగా 1213 నిర్దిష్ట కాల ఉద్యోగుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 208 ఎగ్జిక్యూటివ్, 1005 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఐటీఐ, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు బీఈ/బీటెక్, సీఏ, ఎంబీఏ వంటి అర్హతలు అవసరం. ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ, ఉద్యోగ అనుభవం ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 25. పూర్తి వివరాలకు https://avnl.co.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు.























