గద్వాల నియోజకవర్గంలోని ధరూర్‌లో రూ.339.39 కోట్ల వ్యయంతో హ్యామ్ (HAM) విధానంలో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి…
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు,స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్,కార్పొరేషన్ చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య యాదవ్ తదితర ప్రజాప్రతినిధులు..
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..
తెలంగాణలో అత్యున్నత ప్రమాణాలతో రహదారుల నిర్మాణం చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు..రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రతి గ్రామానికి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు..
గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు,కొత్త రేషన్ కార్డులు అందలేదని విమర్శించిన మంత్రి,కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ సన్నబియ్యం పంపిణీ,ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం,మహిళల ఆర్థిక సాధికారత వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు..
తెలంగాణ కోసం పోరాడి రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని,రాష్ట్ర అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు..ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం మరింత పెరుగుతోందని,రానున్న రోజుల్లో కూడా ప్రజల మద్దతుతో అభివృద్ధి పాలన కొనసాగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు..

























