ఢిల్లీకి బయలుదేరిన కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ బృందం…
తెలంగాణ : కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ బృందం ఢిల్లీకి బయలుదేరింది. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామిని కలవనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కేంద్రమంత్రిని కేటీఆర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, జాన్సన్ నాయక్, CCI సాధన సమితి నాయకులు కోరనున్నారు. అనంతరం ఢిల్లీలో నిర్వహించే మీడియా సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారు.























