SRO కార్యాలయ సొంత భవనం నిర్మాణానికి స్థల పరిశీలన…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్‌లో ప్రతిపాదిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం (SRO) సొంత భవనం నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి తహసీల్దార్ స్థలాన్ని పరిశీలించడం జరిగింది . ప్రతిపాదిత స్థలం అనుకూలత, విస్తీర్ణం, రవాణా సౌకర్యం, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు మెరుగైన రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు సొంత భవనం నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. త్వరితగతిన అవసరమైన పరిపాలనా ప్రక్రియలు పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
స్థల పరిశీలన కార్యక్రమంలో సంబంధిత రెవెన్యూ అధికారులు, సిబ్బంది , కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ చైర్మన్ కన్నె సురేందర్,
మాజీ పట్టణ అధ్యక్షుడు జె జె నర్సయ్య, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగేంద్ర బాబు, కౌన్సిలర్ సందీప్ పాల్గొన్నారు.

























