నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జులై 15న ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, కీలకమైన దేశీయ విధానాలు, శాసనసభ వ్యవహారాలు, కేంద్ర ప్రభుత్వ అజెండాపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ, కొందరు మంత్రుల మార్పులు చేర్పులపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం























