భీంగల్ దీక్షకు వెళ్లకుండా కమ్మర్‌పల్లి బిఆర్‌ఎస్ నాయకులను పోలీసులు స్టేషన్ కు తరలింపు…
త్రిశూల్ న్యూస్ కమ్మర్‌పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్
గనిజామాబాద్ జిల్లా భీంగల్‌లో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేపట్టిన ఒకరోజు కఠోర దీక్షకు వెళ్లేందుకు బయలుదేరకుండా కమ్మర్‌పల్లి మండల బిఆర్‌ఎస్ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.అనంతరం వారిని కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అరెస్టు అయిన వారిలో బషీరాబాద్ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకులు బైకని మహేష్,తోట అప్పయ్య, కమ్మర్ పల్లి ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్,రేంజర్ల మహేందర్,నర్ర మోహన్,డాక్టర్ లక్ష్మీ నర్సయ్య,చౌట్‌పల్లి గ్రామ సర్పంచ్ మహబూబ్ కుంట ప్రతాప్,కమ్మర్‌పల్లి టీఆర్‌ఎస్ నాయకుడు,మాజీ సర్పంచ్ గడ్డం స్వామి తదితరులు ఉన్నారు.
దీక్షలో పాల్గొనేందుకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడాన్ని టీఆర్‌ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.మరోవైపు, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ముందస్తు చర్యల్లో భాగంగా నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసుల వర్గాలు తెలిపినట్లు సమాచారం.

























