తెలంగాణ బీజేపీలో సమన్వయ యత్నాలు: పార్టీ పెద్దల వ్యూహం…
తెలంగాణ బీజేపీలో సమన్వయం పెంచేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. గతంలో విభేదాలతో పార్టీ ప్రయోజనాలకు నష్టం కలిగించిన నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రైతు ఘోష- బీజేపీ భరోసా యాత్ర, సింగరేణి భరోసా యాత్ర వంటి కార్యక్రమాల్లో నేతలందరూ పాల్గొనేలా చూస్తున్నారు. వ్యక్తిగత ఇమేజ్‌కు కాకుండా పార్టీకి క్రెడిట్ రావాలనే ఉద్దేశ్యంతో ఈ మార్పులు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.























