భీంగల్ ప్ర .జూ.కళాశాలలో జలశక్తి అభియాన్- జన భాగిదారి ప్రతిజ్ఞ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
తేదీ 16 గురువారం 2026 ప్రభుత్వ జూనియర్ కళాశాల భీంగల్ నందు మున్సిపల్ శాఖ అధికారులు “జలశక్తి అభియాన్- జనభాగిదారి”అనే విషయంపై ప్రతిజ్ఞ కార్యక్రమము చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గజానన్ మాట్లాడుతూ… మన ప్రాంత అభివృద్ధికి, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి, జల వనరుల సంరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న జలశక్తి శాఖ
“జలమే జీవనానికి మూలాధారం” అనే భావన మీ సేవలు సమాజానికి ఎంతో విలువైనవి . నీటి సంరక్షణ, సమర్థ వినియోగం, భవిష్యత్ తరాలకు జల వనరుల పరిరక్షణలో మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షిస్తు,.
నీటి వనరులను పెంచే మార్గాలు ఇలా తెలియజేశారు.
వర్షపు నీటి సంరక్షణ ప్రతి ఇల్లు, పాఠశాల, ప్రభుత్వ కార్యాలయంలో తప్పనిసరిగా అమలు చేయాలి.
చెరువులు, కుంటలు, కాలువలను పూడిక తీయడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి.
ఇంకుడు గుంతలు నిర్మించి భూగర్భ జలాలను పెంచాలి. డ్రిప్, స్ప్రింక్లర్ సాగు ద్వారా వ్యవసాయంలో నీటి వృథాను తగ్గించాలి.
ప్రతి గ్రామంలో ఎక్కువగా చెట్లు నాటాలి, అడవులను సంరక్షించాలి. వాడిన నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించాలి .చెరువులు, నదులు, వాగుల్లో కాలుష్యాన్ని అరికట్టాలి. ప్రజల్లో నీటి పొదుపుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
లీకేజీ పైపులను వెంటనే మరమ్మతు చేయాలి, తాగునీటి వృథాను అరికట్టాలి.
ప్రతి గ్రామానికి జల సంరక్షణ కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలనీ కోరారు.ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ గజానన్, నరేందర్ , కళాశాల ప్రిన్సిపల్ జయపాల్ రెడ్డి గారు , కౌన్సిలర్లు డాక్టర్ మండలోజు నర్సింహస్వామి , పల్లె శ్రీనివాస్ గౌడ్,కళాశాల అధ్యాపక బృందం , విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.























