భీంగల్‌లో ‘క్యాచ్ ది రైన్’పై అవగాహన సదస్సు…
– నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: మున్సిపల్ కమిషనర్ గజానంద్..
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్, జూలై 16:కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, సీడీఎంఏ (CDMA) ఆదేశాల మేరకు భీంగల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో “జల శక్తి అభియాన్ – జన భాగీదారి (JSJB–3.0)” కార్యక్రమంలో భాగంగా “క్యాచ్ ది రైన్” అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో నీటి సంరక్షణపై చర్చ నిర్వహించడంతో పాటు, నీటిని ఆదా చేయాలని ప్రతిజ్ఞ చేయించారు.
మున్సిపల్ కమిషనర్ గజానంద్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు (రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ పిట్స్) నిర్మించి భూగర్భ జలాల పెంపునకు సహకరించాలని కోరారు. నీరు జీవనాధారం అని, నీటిని వృథా చేయకుండా సంరక్షించడం ద్వారా భావితరాలకు సురక్షిత భవిష్యత్తును అందించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, మున్సిపల్ మేనేజర్, విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

























