రోడ్డు ప్రమాదంలో సీఎం గన్‌మెన్ కిరణ్ మృతి…
Jul 16, 2026, తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ వింగ్‌లో గన్‌మెన్‌గా పనిచేస్తున్న కిరణ్ చనిపోయారు. మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కిరణ్ మృతి చెందారు. 2009 బ్యాచ్ పోలీస్ కానిస్టేబుల్ శాఖలో కిరణ్ చేరారు. గతంలో మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి వద్ద గన్‌మెన్‌గా సేవలు అందించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి సెక్యూరిటీ టీమ్‌లోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు. చిన్న వయసులోనే కిరణ్ మృతి చెందడంతో పోలీస్ వర్గాలు, కుటుంబంలో విషాదం నెలకొంది.























