నందిపేట తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు…
నందిపేట్ జులై 17 త్రిశూల్ న్యూస్: నిజామాబాద్ జిల్లా నందిపేట మండల తాసిల్దార్ సంతోష్ రెడ్డి ని గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెండ్ చేశారు. నందిపేట మండలంలో అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసినందుకు ఎమ్మార్వో ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత కొద్దిరోజుల నుండే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎమ్మార్వో పై అభియోగాల దృష్ట ఆర్మూర్ సబ్ కలెక్టర్ విచారణ చేపట్టి జిల్లా భాస్ కు నివేదిక అందజేసినట్టు సమాచారం. గురువారం నందిపేట మండల కేంద్ర కేజీబీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి అనంతరం మండల తాసిల్దార్ కార్యాలయం కు వచ్చి ఎమ్మార్వో ను సస్పెండ్ చేయడం జరిగింది.























