అంతరిక్షంలోకి సూక్ష్మ శిల్పాలు.. వరంగల్ శిల్పి అరుదైన ఘనత…
తెలంగాణ : వరంగల్‌కు చెందిన సూక్ష్మ శిల్పి అజయ్ కుమార్ మట్టెవాడ చరిత్ర సృష్టించారు. సూది రంధ్రంలో పట్టేంత చిన్న పరిమాణంలో రూపొందించిన డాక్టర్ సీవీ రామన్, డాక్టర్ విక్రమ్ సారాభాయి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సూక్ష్మ శిల్పాలు స్కైరూట్ ఏరోస్పేస్ ప్రయోగించిన విక్రమ్–1 రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి చేరాయి. దీంతో అంతరిక్షంలోకి సూక్ష్మ శిల్పాలను పంపిన తొలి భారతీయ శిల్పిగా అజయ్ కుమార్ నిలిచారు. ఈ ప్రయోగాన్ని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యక్షంగా వీక్షించారు. కాగా, విక్రమ్–1 రాకెట్ రూపకల్పనలో కరీంనగర్‌కు చెందిన యువ ఇంజినీర్ కత్రోజు రోహిత్ కీలక పాత్ర పోషించడం విశేషం.























