బాలికతో అసభ్య ప్రవర్తన.. కానిస్టేబుల్‌పై పోక్సో కేసు నమోదు….
తెలంగాణ : నల్గొండ జిల్లా గుర్రంపోడు PSలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌పై పోక్సో కేసు నమోదైంది. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. గతంలో సత్యనారాయణ రెండుసార్లు పోక్సో కేసుల్లో జైలుకెళ్లి వచ్చాడు. పోక్సో కేసు, రిమాండ్ దృష్ట్యా సత్యనారాయణను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు.























