కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశంలో విద్యార్థులకు ఇబ్బందులు తప్పవా.?
*విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి.*
*డిల్లీలో విద్యార్థులపై, యువత పై మోదీ BJP ప్రభుత్వం చేసిన దమనకాండను ఖండించండి…*
*NTAను రద్దు చేయాలని.*
*విద్యార్థుల మరణాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి* .
*విద్యార్థుల యువకులు ఐక్యంగా పోరాడాలి PDSU, పిలుపు.*
*ఆర్మూర్ పట్టణ బంద్ విజయవంతం అట్లాగే అంబేద్కర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ దగ్దం చేయడం జరిగింది.*
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ గౌడ్
నీట్ పేపర్ లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన కేంద్ర ప్రభుత్వం, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగించడం, నిర్బంధ చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వారన్నారు.
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కళ్లకు విద్యార్థుల ఆవేదన కనబడడం లేదా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనలకు బాధ్యులైన వారిలో బీజేపీతో సంబంధాలున్న వ్యక్తులు ఉన్నారనే ఆరోపణలు వచ్చినప్పటికీ, వారిని కాపాడేందుకే కేంద్ర ప్రభుత్వం అసలు దోషులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. అందుకే లీకేజీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు విద్యార్థులపై లాఠీచార్జీలు, టియర్ గ్యాస్ దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
అంతేకాకుండా, శాంతియుతంగా తమ హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులను కొందరు బీజేపీ మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో **”దేశద్రోహులు”** అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది విద్యార్థి ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నమని విమర్శించారు. దేశ భవిష్యత్తు కోసం ప్రశ్నిస్తున్న విద్యార్థులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం వారిపై నిర్బంధం ప్రయోగించడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.
ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ చైనా బిస్కెట్లు”, దేశద్రోహులు” అంటూ ముద్ర వేయడం వల్ల వాస్తవాలు మారవని నాయకులు పేర్కొన్నారు.
దేశభక్తి అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడం కాదని, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని బాధ్యతాయుతంగా నిలదీయడమే నిజమైన దేశభక్తి అని వారు పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్ వంటి ఘటనల్లో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిన్నప్పుడు, బాధ్యులు ఎవరు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమి చేసింది? భద్రతా వ్యవస్థలు ఎందుకు విఫలమయ్యాయి? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని “చైనా బిస్కెట్లు”, “దేశద్రోహులు” అంటూ ముద్ర వేయడం కంటే, ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని, వాస్తవాలను దేశ ప్రజల ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వ్యక్తిగత దూషణలు చేయడం వాదనలో బలహీనతను మాత్రమే సూచిస్తుందని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిన నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్y చేశారు. అలాగే ప్రశ్నాపత్రాల లీకేజీలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ దాడులకు ఆదేశాలు ఇచ్చిన, అమలు చేసిన పోలీసు మరియు సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
అలాగే, ప్రజాస్వామ్యబద్ధంగా తమ హక్కుల కోసం ప్రశ్నించిన విద్యార్థులు, విద్యార్థి నాయకులపై నమోదు చేసిన అన్ని కేసులను వెంటనే ఎత్తివేయాలని వేయాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యాస్ దుర్గా ప్రసాద్ ఆర్మూర్ ఏరియా అధ్యక్ష కార్యదర్శులు డి నిఖిల్, రాజు,నాయకులు వినోద్,వెంకట్ , రాజేష్ , శివ తదితరులు పాల్గొన్నారు.

























