మున్సిపల్ కార్మికులకు యూనిఫామ్‌లు అందించాలి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
భీమ్‌గల్ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న యూనిఫామ్‌లను వెంటనే అందించాలని మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు సున్నపు ఓంకార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం యూనిఫామ్‌లు అందించాలని ఆదేశించినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు.
ఎండ, వర్షాలను లెక్కచేయకుండా పట్టణ పారిశుద్ధ్యాన్ని కాపాడుతున్న కార్మికులకు యూనిఫామ్‌లు, రక్షణ సామగ్రి, భద్రతా పరికరాలను సకాలంలో అందించాలని కోరారు. వర్షాకాలంలో పారిశుద్ధ్య పనులు మరింత సవాలుగా మారుతున్నందున కార్మికుల భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
గతంలో రేయిన్ జాకెట్లు పంపిణీ చేసినట్లే పెండింగ్‌లో ఉన్న యూనిఫామ్ బట్టలను కూడా వెంటనే అందించాలని కార్మికులు కోరుతున్నారు. సమస్యను పరిష్కరించకపోతే మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో తదుపరి కార్యాచరణ చేపడతామని సున్నపు ఓంకార్ తెలిపారు.

























