శ్రావణమాసం ఇంటింటా మహా యజ్ఞం కార్యక్రమం..
మోత్కూరి కృష్ణమూర్తి ఇంట్లో ఈరోజు దేవ యజ్ఞం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…
శ్రావణమాసం ఇంటింటా మహా యజ్ఞం అనే సంకల్పంతో ఈరోజు శ్రీ మోత్కూరి కృష్ణమూర్తి ఇంట్లో భక్తి శ్రద్దలతో కుటుంబ సభ్యులు బంధువులు మరియు, పతంజలి యోగ సభ్యులువేద మంత్రాలతో ఘనంగా దేవయజ్ఞం జరిపించారు.
దేవ యజ్ఞం అంటే దేవతల పట్ల కృతజ్ఞత ప్రకటించడం దేవ యజ్ఞం వల్ల ఆయురారోగ్యాలతో,సుఖశాంతులతో, అష్ట ఐశ్వరాలతో ఉంటారని పతంజలి యోగ గురువు అంతిరెడ్డి అన్నారు…
ఈ కార్యక్రమం అనంతరం మోత్కూరి కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు అల్పాహారం,తీర్థ ప్రసాదం అందించారు…
ఈకార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, యోగ గురువు అంతి రెడ్డి, వెంకటస్వామి, శకుంతల, వెంకటరాజు,పబ్బ శ్రీ హరి, మల్లారెడ్డి,అయిత బాలకిషన్,హరినాథ్, లింగం చారి,రజనీత, రాధిక, లావణ్య,ప్రమీల, సుమలత, లావణ్య పాల్గొన్నారు..

























