Homeతెలంగాణభీంగల్ అంగడిలో బురదతో ప్రజల అవస్థలు.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు?

భీంగల్ అంగడిలో బురదతో ప్రజల అవస్థలు.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు?

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీంగల్ మున్సిపాలిటీ : భీంగల్ పట్టణంలో ప్రతి సోమవారం జరిగే వారపు అంగడి వర్షాల కారణంగా బురదమయంగా మారి ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంగడి ప్రాంగణంలో ఎక్కడ చూసినా బురద, నిల్వ నీరు కనిపించడంతో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలు జాగ్రత్తగా నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అంగడిలో కూరగాయలు విక్రయించే చిరు వ్యాపారులు సైతం బురద మధ్యనే తమ సరుకులను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. వాహనాల రాకపోకలతో బురద మరింతగా చెల్లాచెదురవుతూ, పాదచారులకు ఇబ్బందులు పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు బురదలో జారిపడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

అంగడికి భీంగల్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. వారపు అంగడి రోజున రద్దీ ఎక్కువగా ఉండటంతో పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజీ సౌకర్యాలు, రహదారి పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

వర్షాలు కురిసిన ప్రతిసారి ఇదే పరిస్థితి పునరావృతమవుతున్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంగడి ప్రాంగణంలో బురద తొలగించడం, నీరు నిల్వ కాకుండా డ్రైనేజీ ఏర్పాటు చేయడం, అవసరమైన చోట మట్టి లేదా మెటల్ వేసి రహదారిని సరిచేయడంతో పాటు క్రమం తప్పకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని భీంగల్ మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి అంగడి ప్రాంగణాన్ని పరిశీలించి, తాత్కాలిక చర్యలతో పాటు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు, వ్యాపారులు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

చంద్రాయన్‌పల్లి వద్ద లారీ బోల్తా…

0
చంద్రాయన్‌పల్లి వద్ద లారీ బోల్తా.. ప్రమాదాలకు అడ్డాగా ఎన్‌హెచ్‌–44! బ్రిడ్జి పనుల్లో జాప్యం.. హెచ్చరిక బోర్డులు, లైటింగ్ లేక ప్రయాణికుల ఇబ్బందులు... ఇందల్వాయి మండల్  త్రిశూల్ న్యూస్  రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల పరిధిలోని...

జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు తోర్లికొండ విద్యార్థులు…

0
జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు తోర్లికొండ విద్యార్థులు అండర్‌–13 విభాగంలో ముగ్గురికి చోటు.. విద్యార్థులను అభినందించిన విద్యాశాఖ అధికారులు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం తోర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన...

తెలంగాణ యూనివర్సిటీకి కేవలం రెండు పోస్టుల కేటాయింపు అన్యాయం: పీడీఎస్‌యూ…

0
తెలంగాణ యూనివర్సిటీకి కేవలం రెండు పోస్టుల కేటాయింపు అన్యాయం: పీడీఎస్‌యూ ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులన్నీ భర్తీ చేయాలి.. కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం కేవలం...

ధర్పల్లి ఆదర్శ పాఠశాలలో క్రీడా వసతులకు రూ.60 లక్షలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి…

0
ధర్పల్లి ఆదర్శ పాఠశాలలో క్రీడా వసతులకు రూ.60 లక్షలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్   నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ...

ధర్పల్లిలో వంద పడకల ఆసుపత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి…

0
ధర్పల్లిలో వంద పడకల ఆసుపత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలోని వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను నిజామాబాద్...

Translate »
error: Content is protected !!