ధర్పల్లిలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
ధర్పల్లి మండల కేంద్రంలోని ధర్పల్లి సీతయ్యపేట్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ భవనంలో ప్రత్యేక యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు కొండ్యాల వినోద్‌తో పాటు కుల బంధువులు సంప్రదాయబద్ధంగా జంజరం (జంధ్యం) ధరించారు. అనంతరం పరస్పరం రాఖీలు కట్టుకుని రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాఖీ పౌర్ణమి వేడుకలతో పద్మశాలి సంఘ భవనం సందడిగా మారింది.
ఈ కార్యక్రమంలో సంఘ కార్యవర్గ సభ్యులు, ధర్పల్లి సీతయ్యపేట్ పద్మశాలి కుల బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

























