భీంగల్ మండలంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
భీంగల్ మండలంలోని రహత్ నగర్, రూప్లా తండా గ్రామాలకు చెందిన నిరుపేద లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
మొదటి దశలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయడంతో, జిల్లా కలెక్టర్ అదనపు ఇళ్లను మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో సంతోష్ కుమార్ మాట్లాడుతూ… లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, హౌసింగ్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు.

























