కమ్మర్పల్లి మండల మహిళా సమాఖ్య సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహణ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్…
నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మండల మహిళా సర్వసభ్య సమావేశాన్ని గురువారం రైతు వేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ మహిళల అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. మహిళా సంఘాలకు రూ.10 లక్షల వరకు VLR వర్తించే విధంగా ప్రభుత్వం GO తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా సంఘాల బ్యాంకు రుణాలకు సంబంధించిన VLRను సక్రమంగా చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

అలాగే మహిళా సంఘాల సభ్యులకు సాధారణ ఇన్సూరెన్స్‌తో పాటు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.10 లక్షల వరకు బీమా సదుపాయం కల్పించడం జరిగిందని వివరించారు. మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.
సమావేశంలో మండల స్థాయి సిబ్బంది, ఉత్తమ VOల ప్రతినిధులు, CCలు, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్లు, నూతనంగా ఎన్నికైన పదాధికారులు, పాత పదాధికారులు మరియు ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు.
అనంతరం మండల జెండర్ ఉచిత సలహా కేంద్రం మరియు **కమ్యూనిటీ మేనేజ్డ్ ట్రైనింగ్ సెంటర్ (CMTC)**లను ముఖ్య అతిథి పాలెపు నరసయ్య చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా కుంట గంగాధర్, ఏరుగట్ల APM హాజరై ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు.
కార్యక్రమంలో MEO ఆంధ్రయ్య, UBI ఫీల్డ్ ఆఫీసర్లు వైభవ్, శివరాజ్ మెహతా, డిస్ట్రిక్ట్ కల్చరల్ కోఆర్డినేటర్ అష్ట గంగాధర్, CCలు నవీన్ కుమార్, భాగ్యవతి, పీరియా నాయక్, రవి, అలేఖ్య, గంగ, లలిత, అన్ని గ్రామ సంఘాల POAలు, గ్రామ సంఘాల అధ్యక్షురాళ్లు, కార్యదర్శులు, మండల సమాఖ్య సిబ్బంది అనసూర్య రాణి, అటెండర్ సత్తెమ్మ తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంఘాల బలోపేతం, మహిళల ఆర్థిక అభివృద్ధి, స్వయం ఉపాధి మరియు మహిళా సాధికారతకు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వక్తలు మీడియా ద్వారా తెలియజేశారు.

























