భీంగల్ కేజీబీవీలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
భీమ్గల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను విద్యార్థినులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు. పాఠశాల ఆవరణలో ప్రత్యేకంగా అలంకరణలు చేపట్టి బాలకృష్ణుడికి పూజలు నిర్వహించారు.
విద్యార్థినులు శ్రీకృష్ణుడి జీవిత విశేషాలు, గీతా సందేశాలు, ధర్మం, సత్యం, న్యాయం వంటి విలువలను వివరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, పాటలు ప్రదర్శించారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థినులకు కృష్ణాష్టమి ప్రాముఖ్యతను వివరించారు.
విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించడంతో పాటు ఐకమత్యం, ఆధ్యాత్మిక భావనలను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఉపాధ్యాయులు తెలిపారు. కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపాల్ డి. అనురాధ ఉపాధ్యాయులు గోదావరి వాసవి, మాధవి, జి. స్వప్న, విజయలక్ష్మి, భారతి తదితరులు పాల్గొన్నారు.

























