ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్‌గా మధు యాష్కీ గౌడ్ ఎంపిక అభినందనీయం
ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
హైదరాబాద్‌లో ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్‌గా ఎంపికైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్‌ను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మధు యాష్కీ గౌడ్‌కు నూతన బాధ్యతలపై ఎమ్మెల్యే భూపతి రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పూల మొక్కను అందజేసి, శాలువాతో సత్కరించారు.
దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న నిపుణులు, మేధావులు, వృత్తి నిపుణులను కాంగ్రెస్ పార్టీతో అనుసంధానం చేయడంలో ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుందని భూపతి రెడ్డి పేర్కొన్నారు. నిపుణుల సూచనలు, సలహాలను విధాన రూపకల్పనలో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించే అవకాశం ఉంటుందని అన్నారు.
మధు యాష్కీ గౌడ్‌కు జాతీయ స్థాయిలో ఈ బాధ్యత దక్కడం కాంగ్రెస్ పార్టీతో పాటు తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని ఎమ్మెల్యే భూపతి రెడ్డి పేర్కొన్నారు. ఆయన అనుభవం, నాయకత్వ సామర్థ్యంతో ప్రొఫెషనల్స్ కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తారని ఆకాంక్షించారు.

























