విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ…
సోమవారం గ్రామంలో సర్పంచ్ మాలోత్ సుమిత్ర సంతోష్ నాయక్ చేతుల మీదుగా పంపిణీ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం
గాంధారి :మండలం సోమవారం గ్రామంలో ప్రభుత్వం అందించిన ఉచిత ఏకరూప దుస్తులను విద్యార్థులకు ఘనంగా పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ మాలోత్ సుమిత్ర, సంతోష్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు ఏకరూప దుస్తులను అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాలోత్ సుమిత్ర మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ గుగ్లోత్ వస్రం నాయక్, MPPS పాఠశాల సిబ్బంది, ప్రధానోపాధ్యాయురాలు సుమలత, దేవలక్ష్మి ఉపాధ్యాయులు స్వామి, AAPC అధ్యక్షురాలు కేతావత్ అరుణ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

























