మవి డిజైనర్ బోటిక్ షాప్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం
కామారెడ్డి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘మవి డిజైనర్ బోటిక్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి బోటిక్‌ను ప్రారంభించిన అనంతరం, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మవి డిజైనర్ బోటిక్ ప్రజలకు నాణ్యమైన డిజైనర్ దుస్తులు, ఆధునిక ఫ్యాషన్ వస్త్రాలను అందిస్తూ మంచి ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.
స్థానికంగా నూతన వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా మహిళలకు, యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పట్టణంలో వ్యాపార రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఛైర్‌పర్సన్ అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నాగరాజు, శ్రీనివాస్ ,దాసు ,ప్రేమ్ ,రాములు ,దిలీప్ ,పుల్యా, బోటిక్ నిర్వాహకులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

























