నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం దూసగాం గ్రామంలో చిరుత పులి సంచారం కలకలం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
గ్రామంలోని శివాలయం గుట్టపై చిరుత పులి సంచరిస్తున్న దృశ్యాలు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చిరుత సంచారంతో గుట్ట పరిసర ప్రాంతాల్లోకి వెళ్లేందుకు గ్రామస్తులు జంకుతున్నారు.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే దూసగాం గ్రామానికి చేరుకుని చిరుత సంచరించినట్లు గుర్తించిన ప్రాంతాన్ని పరిశీలించారు. గుట్ట పరిసరాల్లో చిరుత కదలికలకు సంబంధించిన ఆనవాళ్లను పరిశీలించిన అధికారులు, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా గుట్ట పరిసర ప్రాంతాల్లో సంచరించవద్దని అటవీశాఖ అధికారులు సూచించారు. చిరుత కనిపించినా దాని దగ్గరకు వెళ్లకుండా వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.
చిరుత సంచారంతో దూసగాం గ్రామంలో ప్రస్తుతం ఆందోళన నెలకొంది.

























