Homeతెలంగాణరైతుల కరెంట్ సమస్యను వెంటనే పరిష్కరించాలి...

రైతుల కరెంట్ సమస్యను వెంటనే పరిష్కరించాలి…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

దర్పల్లి మండలంలో బిజెపి మండల అధ్యక్షులు జిర్రా మహిపాల్ మాట్లాడుతూ రైతాంగం విద్యుత్ సరఫరా సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం పంటలు నిండు పొట్ట దశలో ఉన్న సమయంలో కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు రాత్రింబవళ్లు పొలాల్లోనే పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది.

విద్యుత్ అధికారులను అడిగితే “పైనుంచి ఇలాగే వస్తుంది, మాకు తెలియదు” అని సమాధానం ఇస్తున్నారు. ఏఈ ని అడిగినా, డీఈ ని అడిగినా, ఎస్‌ఈ ని అడిగినా ఇదే సమాధానం వస్తోంది. రైతులకు మాత్రం ఈ సమస్యతో తీవ్ర నష్టం, ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

రైతులకు సకాలంలో, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ దర్పల్లి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఏఈ గారికి రైతుల పక్షాన వినతిపత్రం అందజేయడం జరిగింది.

రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని భూపతి రెడ్డి గారికి రైతుల పక్షాన అవగాహన లేదని అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  రైతులను నట్టేట ముంచుతున్నారు అనిదర్పల్లి బీజేపీ మండల శాఖ తీవ్రంగా ఖండిస్తోంది. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోకుండా, “పైనుంచి వస్తుంది” అంటూ అధికారులు బాధ్యతలు తప్పించుకునే పరిస్థితి తీసుకురావడం సరికాదు.

రైతు బాగుంటేనే వ్యవసాయం బాగుంటుంది.. వ్యవసాయం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి వెంటనే విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించి, రైతులకు సక్రమంగా కరెంటు అందించాలని డిమాండ్ చేస్తున్నాము.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కర్క గంగారెడ్డి, సరిచంద్, కర్రోల శ్రీకాంత్, సదానంద్ గౌడ్, నరేష్ గౌడ్, పాలెపు సుమన్, రఘుపతి రెడ్డి, అమ్రూ నాయక్, దోర్నాల రాజశేఖర్, శ్రీనివాస్ రెడ్డి, గోపి తదితరులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులే మేలు..

0
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులే మేలు.. చత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: పర్యావరణ పరిరక్షణ సందేశంతో చత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి...

11వ రాష్ట్ర సబ్-జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలుర పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టుకు ద్వితీయ స్థానం…

0
11వ రాష్ట్ర సబ్-జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలుర పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టుకు ద్వితీయ స్థానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో ఈ నెల 11 నుంచి 13వ...

పీఓపీ గణపతి వద్దు మట్టి గణపతి ముద్దు…

0
పీఓపీ గణపతి వద్దు మట్టి గణపతి ముద్దు... శ్రీ నారాయణ హైస్కూల్ ఆధ్వర్యంలో నేడు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా పీఓపీ గణపతి విగ్రహాలకు...

కొలువైన గణనాథుడు.. పూజలకు భారీ ఏర్పాట్లు…

0
కొలువైన గణనాథుడు.. పూజలకు భారీ ఏర్పాట్లు కామారెడ్డి పట్టణంలోని గాంధీగంజ్‌లో ఆకట్టుకుంటున్న వినాయక మండపాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని గాంధీగంజ్ ప్రాంతంలో వినాయక మండపాలను భక్తిశ్రద్ధలతో,...

ధర్పల్లి లో సహారా బాధితులకు డబ్బులు వెంటనే చెల్లించాలని రౌండ్ టేబుల్ సమావేశం…

0
ధర్పల్లి లో సహారా బాధితులకు డబ్బులు వెంటనే చెల్లించాలని రౌండ్ టేబుల్ సమావేశం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో సహారా ఇండియా సంస్థలో పేద...

Translate »
error: Content is protected !!