కొలువైన గణనాథుడు.. పూజలకు భారీ ఏర్పాట్లు
కామారెడ్డి పట్టణంలోని గాంధీగంజ్‌లో ఆకట్టుకుంటున్న వినాయక మండపాలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం
కామారెడ్డి: వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని గాంధీగంజ్ ప్రాంతంలో వినాయక మండపాలను భక్తిశ్రద్ధలతో, భారీ ఏర్పాట్లతో సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో గణనాథుడు ఘనంగా కొలువుదీరేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రంగురంగుల విద్యుత్ దీపాలు, ప్రత్యేక అలంకరణలు, ఆకర్షణీయమైన సెట్టింగ్‌లతో మండపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలని నిర్వాహకులు, భక్తులు కోరుతున్నారు. గాంధీగంజ్‌లో కొలువుదీరనున్న గణనాథుడి దర్శనం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

























