ధర్పల్లి లో సహారా బాధితులకు డబ్బులు వెంటనే చెల్లించాలని రౌండ్ టేబుల్ సమావేశం…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో సహారా ఇండియా సంస్థలో పేద మధ్యతరగతి ప్రజలు పొదుపు చేసుకున్న దేశంలో 13 కోట్ల సహారా బాధితులకు 3 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ బిజెపి బహుజన సమాజ్ పార్టీ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ బీసీ ఎస్సీ ఎస్టీ పార్టీల నాయకులు పాల్గొని మాట్లాడారు
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార పార్టీ ప్రతినిధి చెలిమెల నరసయ్య మాట్లాడుతూ భవిష్యత్తులో అవసరాలకు పనికొస్తాయని కొండంత ఆశతో పేద మధ్య తరగతి ప్రజలు పొదుపు చేసుకుంటే సహార సంస్థ టైంలో చెల్లించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేయడం మూలంగా వేలాదిమంది ఖాతాదారులు వందలాది మంది ఏజెంట్లు సొసైడ్ చేసుకొని చనిపోయారని అన్నారు
కాంగ్రెస్ పార్టీ ధర్పల్లి మాజీ సర్పంచ్ మిట్టపల్లి గంగారెడ్డి మాట్లాడుతూ వడ్డీ రేట్లు అధికం చూపెడుతూ పేద ప్రజల్ని ఆకర్షిస్తూ డిపాజిట్లు సేకరించిన తర్వాత ప్రభుత్వ అండదండలతో ప్రజల్ని మోసం చేస్తున్నారని ప్రైవేట్ సంస్థలపై ప్రభుత్వన్నిగా లేకపోవడం మూలంగానే ఇట్లాంటి తప్పిదాలు జరుగుతున్నాయని విమర్శించారు.
బిజెపి పార్టీ మాజీ మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి మాట్లాడుతూ ప్రజల అమాయకత్వాలను ఆసరా చేసుకుని పుట్టగొడుగుల ప్రైవేటు కంపెనీలు అరచేతిలో వైకుంఠం చూపెడుతూ ఆర్థికంగా ప్రజల్ని నష్టం చేస్తూ పెట్టుబడిదారుల ఆస్తులు మాత్రం పెంచుకుంటున్నారని 13 కోట్ల పేద మధ్యతరగతి ప్రజలపై ప్రేమ ఉంటే వెంటనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ఖాతాదారులు డబ్బులు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల జిల్లా నాయకుడు మహిపాల్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారుల ఆస్తులను పెంచడానికె ఉన్నాయని ప్రజల కష్టాలను తీర్చడం కోసం లేవని సహారా సంస్థలో బడుగు బలహీన వర్గాల ప్రజలు పొదుపు చేసుకుంటే గద్దలాగా దోచుక తింటున్నారని ఆదాని అంబానీ ఆస్తులు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం పని చేస్తుంది తప్ప పేదల కోసం కాదని అన్నారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల నాయకులు అనిల్ మాట్లాడుతూ దేశంలో 80 శాతం పేద ప్రజల కష్టాజితన్నీ 20 శాతం ఉన్న ధనవంతులు పరోక్షంగా దోచుకుంటున్నారని వెయ్యిల కోట్ల రూపాయలను నేషనల్ బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు రుణమాఫీ చేస్తున్నారని, పేదవాడు పొదుపు చేసుకున్న డబ్బులు మాత్రం వారికి ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావడం లేదని అన్నారు
సహారా ఇండియా బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి బాలయ్య మాట్లాడుతూ పొదుపు చేసుకున్న డబ్బులు ఇవ్వాలని గత ఐదు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం పై పోరాటం చేస్తున్న చెవిటి వాని ముందు శంకు దినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఖాతాదారుల డిమాండ్లను పెడచెవున పెడుతూ 13 కోట్ల ఖాతా రుల్ని మోసం చేస్తుందని అన్నారు సుప్రీంకోర్టులో 2012 నుంచి ఇప్పటివరకు కేసును నాల్చడం వల్ల ఎన్నో కుటుంబాలు బజారున పడ్డాయి ఎన్నో కుటుంబాల్లో విషాదాలు మిగిలాయి కోర్టు ముందు ధర్నా చేసిన వినిపించుకోకుండా కోర్టు కాలయాపన చేయడం తగదు. న్యాయం కోసం కోర్టులు పనిచేస్తున్నాయని చెబుతున్నప్పటికీ పేదవారికి న్యాయం చేయడంలో కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు విఫలమవుతున్నాయని అన్నారు.సహారా ఇండియా యొక్క ఆస్తుల్ని ఆదానికి అప్పగించాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కాలయాపన చేస్తున్నట్లు అర్థమవుతుంది.ఇప్పటికైనా దేశంలో 13 కోట్ల పేద మధ్యతరగతి ప్రజల డబ్బుల్ని సహార ఆస్తుల్ని అమ్మి ప్రతి ఖాతాదారునికి అందే విధంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేనియెడల భవిష్యత్తులో జరిగే ఎలక్షన్లలో తగిన గుణపాఠం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం . ఈ కార్యక్రమంలో సహారా బాధితులు సురేష్ లక్ష్మీనరసయ్య కిషన్ తదితరులు పాల్గొన్నారు

























