11వ రాష్ట్ర సబ్-జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలుర పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టుకు ద్వితీయ స్థానం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించిన 11వ రాష్ట్ర సబ్-జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలుర పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టు ద్వితీయ స్థానాన్ని సాధించింది.
సెమీ ఫైనల్‌లో జగిత్యాల జట్టుపై 1–0 పరుగుల తేడాతో విజయం సాధించిన నిజామాబాద్ జిల్లా జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో మంచిర్యాల జిల్లా జట్టుతో జరిగిన పోరులో 1–3 పరుగుల తేడాతో ఓటమి చెంది రన్నరప్‌గా నిలిచింది.
అనంతరం ముఖ్య అతిథులు డీవైఎస్‌ఓ హనుమంత్ రెడ్డి, బెల్లంపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. శ్రీనివాస్, సాఫ్ట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి కె. శోభన్ బాబు, రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నవీన్ చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లా జట్టుకు ట్రోఫీ, రజత పతకాలు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి. ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్ విజేత క్రీడాకారులను, జిల్లా జట్టు కోచ్‌లు నరేష్, అనికేత్‌లను అభినందించారు.

























