పోతంగల్ మండలంలో గణనాథుల వద్ద పుప్పాల శంకర్ యువసేన సందడి
గ్రామ గ్రామాన లడ్డూ పంపిణీ.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన యువసేన నాయకులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్ ఆధ్వర్యంలోని యువసేన ప్రతినిధులు ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణపతి మండపాలను యువసేన సభ్యులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు, గ్రామ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి గణపతి మండపం వద్ద లడ్డూలను పంపిణీ చేశారు.
స్థానిక యువతను ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని యువసేన ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పుప్పాల అభిషేక్, గంధపు రాజు, సుదం అరుణ్, చాంద్ పాషా, పులకంటి సాయిలు, వేణు, విష్ణువర్ధన్‌తో పాటు యువసేన సభ్యులు, స్థానిక యువకులు, భక్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కార్యక్రమం ఘనంగా కొనసాగింది.

























