Homeతెలంగాణకేసీఆర్ పదేళ్ల పాలనలో గిరిజనులకు స్వర్ణ యుగం...

కేసీఆర్ పదేళ్ల పాలనలో గిరిజనులకు స్వర్ణ యుగం…

కేసీఆర్ పదేళ్ల పాలనలో గిరిజనులకు స్వర్ణ యుగం…

-ఆరు నుంచి పది శాతానికి పెరిగిన గిరిజనుల రిజర్వేషన్లు

గ్రామపంచాయితీలుగా మారిన తండాలు

-కనీవినీ ఎరుగని రీతిలో గిరిజన పల్లెల్లో అభివృద్ధి, సంక్షేమం

-1682 ఎస్టీ ఆవాసాలలో రూ. 1276కోట్లతో రోడ్ల నిర్మాణం

-రూ. 292కోట్లతో 92గురుకులాల ఏర్పాటు

-రూ.151కోట్లతో 2,28,089 మంది ఎస్టీ మహిళలకు కేసీఆర్ కిట్లు

-1,36,730 మంది గిరిజన ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి

-పెద్ద ఎత్తున ఆదివాసీ,బంజారా ఆత్మగౌరవ భవనాలు

-బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

నిజామాబాద్, సెప్టెంబర్ 15:- బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో గిరిజనులకు స్వర్ణ యుగమని బీఆర్ఎస్

నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అభివర్ణించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం జీవన్ రెడ్డి మంగళ వారం విడుదల చేసిన ఒక ప్రకటనలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం అమలు చేసిన కార్యక్రమాలను వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో

ఆరు శాతంగా ఉన్న గిరిజనుల రిజర్వేషన్లు

పది శాతానికి పెంచిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. అయిదు వందల కంటే ఎక్కువ జనాభా, అప్పటికే ఉన్న గ్రామపంచాయితీ కేంద్రానికి 15కిలో మీటర్ల కంటే ఎక్కువ ఉన్న గిరిజన తండాలు, గూడేలు, ఆవాసాలను పరిగణనలోకి తీసుకొని మొత్తం 4,383 కొత్త గిరిజన గ్రామపంచాయితీలను తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినట్టు జీవన్ రెడ్డి వివరించారు. ఈ కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు వల్ల అదనంగా సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రామ పంచాయతీ నిధులు, స్థానికి అభివృద్ధి పనులపై స్వీయ నిర్ణయాధికారం, పారిశుధ్యం, అంతర్గత రోడ్లు, వీధి దీపాలు, తాగునీటి పథకాలు, డ్రైనేజీ, స్వపరిపాలన ప్రతీ కొత్త గ్రామ పంచాయతీకి సమకూరిందని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా వేల కోట్ల రూపాయలతో కనీవినీ ఎరుగని రీతిలో గిరిజన పల్లెల్లో అభివృద్ధి, సంక్షేమం పథకాలు అమలు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

1682 ఎస్టీ ఆవాసాలలో రూ. 1276కోట్లతో రోడ్ల నిర్మాణం పూర్తి చేసిన ఘనత కేసీఆర్ దన్నారు.

రూ. 292కోట్లతో 92గురుకులాల ఏర్పాటు,

రూ.151కోట్లతో 2,28,089 మంది ఎస్టీ మహిళలకు కేసీఆర్ కిట్ల పంపిణీ,

1,36,730 మంది గిరిజన ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్ధిక సహకారం,3,75, 316 మంది గిరిజనులకు రూ. 4.286 పెన్షన్ల పంపిణీ వారి సామాజిక స్థితిగతుల్లో గణనీయమైన మార్పులు తెచ్చినట్లు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. దాదాపు రూ 50 కోట్లతో పెద్ద ఎత్తున ఆదివాసీ,బంజారా ఆత్మగౌరవ భవనాలు నిర్మించామన్నారు. గిరిజన గ్రామాల్లో రూ.133 కోట్లతో మురుగు నీటి పారుదల వ్యవస్థల నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు. 237 మంది ఎస్టీ విద్యార్థుల విదేశీ విద్యకు రూ. 33.40 కోట్లు,1424 మంది గిరిజన యువకులకు వాహనాలు సమకూర్చ డానికి రూ. 101.50, మేడారం, నాగోబా, జంగుబాయి తదితర జాతర్లకు రూ.354 కోట్లు, సమ్మక్క, సారలమ్మ మ్యూజియం ఏర్పాటుకు రూ.22.53 కోట్లు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.8,23,780 మంది ఎస్టీ రైతులకు రూ.7.354 కోట్ల రైతుబంధు ,4,93, 720మంది రైతులకు రూ.611 కోట్ల రైతుబీమా, రూ.221 కోట్లను గిరిజనుల వ్యవసాయానికి విద్యుత్ సరఫరా కోసం, రూ. 1.837.08 కోట్లతో గిరిజన గ్రామాల్లో అభివృద్ధి పనులు, రూ. 300కోట్లతో గిరిజన గ్రామపంచాయితీ భవనాల నిర్మాణం చేపట్టినట్లు జీవన్ రెడ్డి వివరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

కనీస సౌకర్యాలు లేక భీంగల్ కోర్టుకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు…

0
కనీస సౌకర్యాలు లేక భీంగల్ కోర్టుకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో నూతనంగా ప్రారంభమైన ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో కనీస సౌకర్యాలు...

ధర్పల్లి గ్రామ సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ…

0
ధర్పల్లి గ్రామ సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: ధర్పల్లి గ్రామ సచివాలయంలో గురువారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్...

ధర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం…

0
మీ వార్తను పత్రికా శైలిలో సరిచేసి ఇస్తున్నాను:   ధర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి: ధర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా...

భీంగల్‌లో ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు…

0
భీంగల్‌లో ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ స్వర్ణకార వ్యాపార, వర్తక సంఘం ఆధ్వర్యంలో గురువారం విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భీంగల్...

భీమ్‌గల్‌లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు…

0
భీమ్‌గల్‌లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్...

Translate »
error: Content is protected !!