గణనాథుడికి ఘనంగా పూజలు
హిందూ సేన ఆధ్వర్యంలో భక్తుల సందడి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ రోడ్డులో హిందూ సేన ఆధ్వర్యంలో భారీ గణనాథుడిని ప్రతిష్ఠించారు.
హిందూ సేన 23వ వార్షికోత్సవం సందర్భంగా గణనాథుడికి బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజా కార్యక్రమాలకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
వేదమంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించి గణనాథుడి ఆశీస్సులు పొందారు.
విద్యానగర్ కాలనీకి చెందిన కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
విగ్రహ దాత: లాభశెట్టి భానుతేజ, వారి కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
గణనాథుడి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ప్రాంతంలో సందడి నెలకొంది.
భక్తిశ్రద్ధలతో గణనాథుడిని కొలుస్తూ ప్రజలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించారు.
విద్యానగర్ కాలనీవాసులు, హిందూ సేన సభ్యులు, భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

























