Homeతెలంగాణరేవంత్ రెడ్డి సర్కారు దాడులకు ప్రతి దాడులు జీవన్ రెడ్డి...

రేవంత్ రెడ్డి సర్కారు దాడులకు ప్రతి దాడులు జీవన్ రెడ్డి…

రేవంత్ రెడ్డి సర్కారు దాడులకు ప్రతి దాడులు జీవన్ రెడ్డి…


-బీఆర్ఎస్ ది 60లక్షల గులాబీ సైన్యం, కేసీఆర్ కనుసైగ చేస్తే కాంగ్రెస్ మాడి మసి

–రాజకీయ కుట్రతో కేసీఆర్ ను టచ్ చేస్తే తెలంగాణ నిప్పుల కుంపటే

-కేసీఆర్ , కేటీఆర్ లపై వేధింపులు తెలంగాణ ఆత్మగౌరవానికే తలవంపు

–తెలంగాణ స్ఫూర్తికి కాంగ్రెస్ అపకీర్తి

-నీ ఆటలు ఇంకెంత కాలం రేవంత్ ? వచ్చే ఎన్నికల్లో నీ ఖేల్ ఖతం

-వచ్చేది కేసీఆర్ తెలంగాణ రాజ్యమే

-అరాచకం చేయిస్తున్న సర్కార్ గూండాలు, కాంగ్రెస్ అనుకూల పోలీసు అధికారులు చంచల్ గూడ జైలుపాలే

-కేసీఆర్ పదేళ్ల పాలనలో మేమూ మీలాగే చేస్తే కాంగ్రెస్ బతికిబట్టగట్ట కలిగేదా?

-కాంగ్రెస్ రాక్షస సర్కారుపై పెల్లుబికుతున్న జనాగ్రహం

-కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లకు భయపడం

-కాంగ్రెస్ అంటేనే స్కామ్ ల పార్టీ

-ఏ టూ జెడ్ కుంభకోణాలు కాంగ్రెస్ ఘన కార్యాలు

-రేవంత్ రెడ్డి పాలనలో నడుస్తున్నది ‘అనుముల రాజ్యాంగం’

-తెలంగాణలో హింసాత్మక ఇందిరమ్మ రాజ్యం, రేవంత్ రెడ్డి రౌడీ పాలన

-అడుగడుగున రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్

-రాజ్యాంగం వర్సెస్ రేవంత్ రెడ్డి ‘రాక్షస పాలన’

-ఇది ప్రజా పాలన కాదు పోలీసు పాలన

-కాంగ్రెస్ పాలన కాదు కేసుల పాలన

-కంచెల పాలనంటూ దుష్ప్రచారం చేసి చివరకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యం లో ముంచే పాలన

-ప్రశ్నించే వారిపై నిస్సిగ్గుగా దాడులు చేయిస్తున్నగూండా సర్కార్

-కేసీఆర్,కేటీఆర్ లను పధకం ప్రకారం వేధిస్తున్నారు.

-చివరకు కేటీఆర్ పీఆర్వో, పీఏ లను కూడా విచారణలకు పిలిచారు

-వారిపై పోలీసుల స్టేషన్ లోనే ముసుగులు ధరించిన గూండాలతో దాడులు

-కేసీఆర్ తెలంగాణ స్వరం, వింటేనే రేవంత్ రెడ్డికి జ్వరం

-కేటీఆర్ అంటే రేవంత్ రెడ్డి లాగు తడుస్తోంది

-అందుకే కేసీఆర్, కేటీఆర్ లను రేవంత్ సర్కారు టార్గెట్ చేసింది

-ఎలాంటి తప్పులు చేయకపోయినా కేసీఆర్, కేటీఆర్ లకు నోటీసులు ఇచ్చారు

-విచారణలపేరుతో వారిని కాంగ్రెస్ సర్కారు నానా హింస పెడుతోంది

-ఇవి చాలవన్నట్టు గతంలో గజ్వేల్ లో కేసీఆర్ క్యాంప్ కార్యాలయం పై కాంగ్రెస్ గూండాల దాడి చేశారు.

-ఇటీవల కాంగ్రెస్ రౌడీల మంద ఎర్రవల్లి లోని కేసీఆర్ ఫాం హౌస్ పై పైశాచిక దాడి చేసి కేసీఆర్ పై హత్యాయత్నానికి తెగబడింది.

-తాజాగా కేటీఆర్ పీఆర్వో, పీఏలపై పోలీసుల సమక్షంలో కాంగ్రెస్ ముసుగు రౌడీల దాడి

-ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో జరుగుతున్నవే

-నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 15:-
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాంత అధికార మదంతో విచ్చలవిడిగా జరిపిస్తున్న దాడులకు బీఆర్ఎస్ ప్రతి దాడులకు దిగకతప్పదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ భవన్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది ప్రజా పాలన కాదు పోలీసు పాలన అని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ పాలన కాదు కేసుల పాలన, కేసీఆర్ ది కంచెల పాలనంటూ దుష్ప్రచారం చేసి చివరకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యం లో ముంచే పాలన వచ్చిందని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో మేమూ మీలాగే చేస్తే కాంగ్రెస్ బతికిబట్టగట్ట కలిగేదా? అని నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ది 60లక్షల గులాబీ సైన్యమని , కేసీఆర్ కనుసైగ చేస్తే కాంగ్రెస్ మాడి మసికాక తప్పదని ఆయన అన్నారు. రాజకీయ కుట్రతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కర్మ, కర్త, క్రియ, తెలంగాణకు భారత దేశ చిత్ర పటంలో సమున్నత స్థానం కలిగించిన స్ఫూర్తి ప్రధాత, తెలంగాణ జాతిపిత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను టచ్ చేస్తే తెలంగాణ నిప్పుల కుంపటేనని ఆయన తీవ్ర స్వరంతో వార్నింగ్ ఇచ్చారు.
కేసీఆర్ , కేటీఆర్ లపై కాంగ్రెస్ ప్రభుత్వ వేధింపులు తెలంగాణ ఆత్మగౌరవానికే తలవంపుగా జీవన్ రెడ్డి అభివర్ణించారు. రేవంత్ రెడ్డి దిక్కుమాలిన పరిపాలన తెలంగాణ స్ఫూర్తికి తీవ్ర అపకీర్తి అని ఆయన విమర్శించారు.
నీ ఆటలు ఇంకెంత కాలం రేవంత్ ? వచ్చే ఎన్నికల్లో నీ ఖేల్ ఖతం. వచ్చేది కేసీఆర్ తెలంగాణ రాజ్యమే. అరాచకం చేయిస్తున్న నీవు, నీసర్కార్ గూండాలు, కొందరు కాంగ్రెస్ అనుకూల పోలీసు అధికారులు చంచల్ గూడ జైలుపాలు కాక తప్పదు అని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ రాక్షస సర్కారుపై
జనాగ్రహం పెల్లుబికు తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లకు భయపడమన్నారు.
కాంగ్రెస్ అంటేనే స్కామ్ ల పార్టీ అని, ఏ టూ జెడ్ కుంభకోణాలు కాంగ్రెస్ ఘన కార్యాలు అని,
రేవంత్ రెడ్డి పాలనలో నడుస్తున్నది ‘అనుముల రాజ్యాంగం’ నడుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
తెలంగాణలో హింసాత్మక ఇందిరమ్మ రాజ్యం, రేవంత్ రెడ్డి రౌడీ పాలనను వదల బోమన్నారు. అడుగడుగున రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ కు రోజులు దగ్గర పడుతున్నాయన్నారు.
రాజ్యాంగం వర్సెస్ రేవంత్ రెడ్డి ‘రాక్షస పాలన’ అన్న విధంగా పరిస్థితి మారిందని, ప్రజా సమస్యలపై
ప్రశ్నించే వారిపై నిస్సిగ్గుగా దాడులు చేయిస్తున్నగూండా సర్కార్ ఇది అని జీవన్ రెడ్డి ఆరోపించారు.
కేసీఆర్,కేటీఆర్ లను పధకం ప్రకారం వేధిస్తున్నారన్నారు.
చివరకు కేటీఆర్ పీఆర్వో, పీఏ లను కూడా విచారణలకు పిలిచారని,
వారిపై పోలీసుల స్టేషన్ లోనే ముసుగులు ధరించిన గూండాలతో దాడులు చేయించారని ఆయన ధ్వజమెత్తారు.
కేసీఆర్ తెలంగాణ స్వరం అని, అది వింటేనే రేవంత్ రెడ్డికి జ్వరం వస్తోందని, కేటీఆర్ అంటే రేవంత్ రెడ్డి లాగు తడుస్తోందని, అందుకే కేసీఆర్, కేటీఆర్ లను రేవంత్ సర్కారు టార్గెట్ చేసిందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఎలాంటి తప్పులు చేయకపోయినా కేసీఆర్, కేటీఆర్ లకు నోటీసులు ఇచ్చారని, విచారణల పేరుతో వారిని కాంగ్రెస్ సర్కారు నానా హింస పెడుతోందని మండిపడ్డారు.
ఇవి చాలవన్నట్టు గతంలో గజ్వేల్ లో కేసీఆర్ క్యాంప్ కార్యాలయం పై కాంగ్రెస్ గూండాల దాడి చేశారని,
ఇటీవల కాంగ్రెస్ రౌడీల మంద ఎర్రవల్లి లోని కేసీఆర్ ఫాం హౌస్ పై పైశాచిక దాడి చేసి కేసీఆర్ పై హత్యాయత్నానికి తెగబడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేట లో హరీష్ రావు క్యాంపు కార్యాలయాలపై దాడి చేసిన నీచ చరిత్ర కాంగ్రెస్ దన్నారు.
తాజాగా కేటీఆర్ పీఆర్వో, పీఏలపై పోలీసుల సమక్షంలో కాంగ్రెస్ ముసుగు రౌడీలు జరిపిన దాడి దేనికి సంకేతం అని ఆయన నిలదీశారు. ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో జరుగుతున్నవేనని ఆరోపించారు.
ప్రజాస్వామ్యానికి ఉప్పు పాతరేస్తున్న కాంగ్రెస్ కిరాతక చర్యలను చూస్తుంటే తెలంగాణ ఎటు పోతోందో అర్థం కావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ సాధించిన ఉద్యమ యోధులపై ఇన్ని కక్ష సాధింపు చర్యలా? అని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ నోట బూతులు, ఏతులు తప్ప చేతలు లేవన్నారు.
తెలంగాణ కు వ్యతిరేకంగా రేవంత్, మోడీ, చంద్రబాబు సాగిస్తున్న కుయుక్తులను ఎండగడతం అని జీవన్ రెడ్డి హెచ్చరించారు.
కేసీఆర్ గొప్ప విజనరీ, రేవంత్ చిప్పకూడు తిన్న ప్రిజనరీ అని,
కేసీఆర్ దేశాన్నే కదిలించిన గొప్ప ఉద్యమ నేత, తెలంగాణ జాతిపిత అని, ఇచ్చిన హామీలు అమలు చేయలేని చేత కాని దద్దమ్మ రేవంత్ అని ఆయన అన్నారు.
వైఫల్యాల నుచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్ డైవర్షన్ పోలిటిక్స్ చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ నీడను కూడా తాకలేరన్నారు.
రేవంత్ రెడ్డే తెలంగాణ చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని, అధికారం ఎవడి సొత్తు కాదు ..శాశ్వతం కాదని ఆయన స్పష్టం చేశారు.
మహౌద్యమ కారుడు కేసీఆర్ ను తెలంగాణ తెచ్చిన మనిషి అని,
ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.
గల్లీ లీడర్ కన్నా అద్వాన్నంగా చిల్లర గా రేవంత్ తీరు ఉందన్నారు. రేవంత్ గడ్డి తింటున్నాడా అన్నం తింటున్నాడా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాజకీయాలకు పట్టిన శని, అష్టదరిద్రం రేవంత్ అని ఆయన అన్నారు.
కేసీఆర్ కు ఘోరీ కడతావా ?ఎందుకు కడతావు?. తెలంగాణ తెచ్చినందుకా ?తెలంగాణ ను అన్ని విధాల అభివృద్ధి చేసినందుకా? అని ఆయన మండిపడ్డారు.
కేసీఆర్ మీద భాష ఇలాగే కొనసాగితే తెలంగాణ ప్రజలే రేవంత్ నాలుక చీరేస్తారని ఆయన హెచ్చరించారు.
కాంగ్రెస్ నేతలవి లఫంగి ,బట్టెబాజ్ మాటలు అని, గోబెల్స్ ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తు న్నారని ఆయన అన్నారు.హామీల అమలు చేత కాక పోతే కాంగ్రెస్ నేతలు చెంపలు వేసుకోవాలన్నారు.
తిట్లతో, దాడులతో ప్రజల దృష్టి ని మళ్ళించలేరన్నారు.
కేసీఆర్ ది ఉద్యమ చరిత్ర కాగా రేవంతుది ద్రోహ చరిత్ర అని, జై ఆంధ్రా అంటూ తెలంగాణ ద్రోహులకు సద్ది కట్టిన దొంగ రేవంత్ రెడ్డి అని,
ఓటుకు నోటు కేసులో పట్టపగలు దొరికిన పగటి దొంగ అని ఆయన ఎద్దేవా చేశారు.
కేసీఆర్ మనోడు అయితే, రేవంతు మందోడు అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్ర సీఎంగా ఉంటూ ఏపీకి మన నీళ్లు తాకట్టు పెడుతున్న ద్రోహి రేవంత్ అని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబుతో దోస్తీ కట్టి రాష్ట్రానికి మోసం చేస్తున్నడన్నారు.
రేవంత్ రెడ్డి ఔట్ సోర్సింగ్ సీఎం అని,
ఆయన కాంగ్రెస్ బ్రాండ్ కాదు, ఆర్ ఎస్ ఎస్ ప్రొడక్టు అని జీవన్ రెడ్డి తెలిపారు. కరెఫ్ట్ కోసం కాంగ్రెస్ కు షిఫ్ట్ అయ్యాడన్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే చీమల పుట్టలోకి దూరిన పాము రేవంత్ అని ఆయన ఎద్దేవా చేశారు. గల్లీ గల్లీలో బీఆర్ఎస్ నేతలపై పోలీసు కేసులు
ఢిల్లీకి సూట్ కేసులు అని ఆయన దుయ్యబట్టారు.
ఏఐసిసికీ ఏటీఎంగా తెలంగాణ మారిందన్నారు.
ఇక్కడ జనాన్ని కొట్టి బతకడం
ఢిల్లీలో దొంగ దొరై తిరగడం రేవంత్ తీరుగా మారిందన్నారు.
కప్పం కట్టడం వల్లే సీఎం పోస్టింగ్, లేకుంటే ఎప్పుడో ఊస్టింగ్ అని ఆయన అన్నారు.
కేసీఆర్ లెక్కలు తెలుస్తావా రేవంత్ రెడ్డి ?, లెక్కలు తేల్చడానికి కేసీఆర్ ఏమైనా నీ రియల్ ఎస్టేట్ లే అవుట్ అనుకున్నావా?.
ముట్టుకుంటే మాడి మసయ్యే బ్లో అవుట్ అని ఆయన వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి అంటేనే డిల్లీ కాంగ్రెస్ పెద్దల కాళ్ళ దగ్గర బానిసత్వం,
తెలంగాణ ప్రజల పట్ల క్రూరత్వం అని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మెగా రక్తదాన శిబిరం తొలి 100 మంది రక్తదాతలకు హెల్మెట్లు…

0
మెగా రక్తదాన శిబిరం తొలి 100 మంది రక్తదాతలకు హెల్మెట్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఐవీఎఫ్ సేవాదళ్ ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డిలో మెగా రక్తదాన...

పట్టపగలే దోపిడీ దొంగ బీభత్సం…

0
పట్టపగలే దోపిడీ దొంగ బీభత్సం.. ఒంటరి మహిళపై బ్లేడుతో దాడి.. రూ.3 లక్షల విలువైన పుస్తెలతాడు అపహరణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి, సెప్టెంబర్ 15: కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో పట్టపగలే దోపిడీ...

కేసీఆర్ పదేళ్ల పాలనలో గిరిజనులకు స్వర్ణ యుగం…

0
కేసీఆర్ పదేళ్ల పాలనలో గిరిజనులకు స్వర్ణ యుగం... -ఆరు నుంచి పది శాతానికి పెరిగిన గిరిజనుల రిజర్వేషన్లు గ్రామపంచాయితీలుగా మారిన తండాలు -కనీవినీ ఎరుగని రీతిలో గిరిజన పల్లెల్లో అభివృద్ధి, సంక్షేమం -1682 ఎస్టీ ఆవాసాలలో రూ. 1276కోట్లతో...

మోర్తాడ్ సభలో మంత్రి సీతక్క పచ్చి అబద్ధాలు… వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్

0
మోర్తాడ్ సభలో మంత్రి సీతక్క పచ్చి అబద్ధాలు మాట్లాడారు ముందు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క చెప్పాలి: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి... హైదరాబాద్: మోర్తాడ్ సభలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సీతక్క...

మున్సిపల్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి…

0
మున్సిపల్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేసిన మున్సిపల్ ప్రతినిధులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన పంచాయతీరాజ్ శాఖ ఇన్‌చార్జ్ మంత్రి సీతక్క,...

మెగా రక్తదాన శిబిరం తొలి 100 మంది రక్తదాతలకు హెల్మెట్లు…

0
మెగా రక్తదాన శిబిరం తొలి 100 మంది రక్తదాతలకు హెల్మెట్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఐవీఎఫ్ సేవాదళ్ ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డిలో మెగా రక్తదాన...

పట్టపగలే దోపిడీ దొంగ బీభత్సం…

0
పట్టపగలే దోపిడీ దొంగ బీభత్సం.. ఒంటరి మహిళపై బ్లేడుతో దాడి.. రూ.3 లక్షల విలువైన పుస్తెలతాడు అపహరణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి, సెప్టెంబర్ 15: కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో పట్టపగలే దోపిడీ...

కేసీఆర్ పదేళ్ల పాలనలో గిరిజనులకు స్వర్ణ యుగం…

0
కేసీఆర్ పదేళ్ల పాలనలో గిరిజనులకు స్వర్ణ యుగం... -ఆరు నుంచి పది శాతానికి పెరిగిన గిరిజనుల రిజర్వేషన్లు గ్రామపంచాయితీలుగా మారిన తండాలు -కనీవినీ ఎరుగని రీతిలో గిరిజన పల్లెల్లో అభివృద్ధి, సంక్షేమం -1682 ఎస్టీ ఆవాసాలలో రూ. 1276కోట్లతో...

మోర్తాడ్ సభలో మంత్రి సీతక్క పచ్చి అబద్ధాలు… వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్

0
మోర్తాడ్ సభలో మంత్రి సీతక్క పచ్చి అబద్ధాలు మాట్లాడారు ముందు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క చెప్పాలి: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి... హైదరాబాద్: మోర్తాడ్ సభలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సీతక్క...

మున్సిపల్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి…

0
మున్సిపల్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేసిన మున్సిపల్ ప్రతినిధులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన పంచాయతీరాజ్ శాఖ ఇన్‌చార్జ్ మంత్రి సీతక్క,...
Translate »
error: Content is protected !!