14వ వార్డులో మట్టి గణపతుల పంపిణీ…
పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని 14వ వార్డు కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత తెలిపారు. కామారెడ్డి మున్సిపాలిటీ 14వ వార్డు ngo’s కాలనీ శ్రీ ప్రసన్నంజనేయ ఆలయంలో మట్టి గణపతుల పంపిణి చేయడం జరిగిందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయన రంగులతో చేసే విగ్రహాల వల్ల జలాశయాలు కలుషితం అవుతున్నాయని కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతీ ఒక్కరు మట్టి గణపతిని పూజించాలని పేర్కొన్నారు. కాలుష్య కారకాలైన పీఓపీ విగ్రహాల నిమజ్జనం వల్ల జలాశయాలు, చెరువులు, ఇతర నీటి వనరులు కలుషితమవుతాయని, దీని వల్ల ప్రకృతితోపాటు ప్రాణికోటికి హానికర మన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం అవసర మన్నారు. పర్యావరణహితం కోసం రెండు వందల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు సబ్బనీ కృష్ణహరి, సేవాదళ్ నియోజకవర్గ అధ్యక్షులు మెహెర్ బాబా గౌడ్, ఆలయ కమిటీ సెక్రటరీ దామోదర్, వార్డు సభ్యులు కమ్మరి భాస్కర్, రాజేశ్వర్ రావ్, మార బాల్ రెడ్డి సంతోష్, రంజిత్, దేవేందర్, సంగారావ్, రాజయ్య కాలనీ వాసులు పాల్గొన్నారు..























