Homeతెలంగాణశిరీష హత్య కేసులో ప్రైమ్ కేర్ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలి...

శిరీష హత్య కేసులో ప్రైమ్ కేర్ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలి…

శిరీష హత్య కేసులో ప్రైమ్ కేర్ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలి

హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే దారుణం జరిగింది

తెలంగాణ రక్షణ సేన నాయకుల డిమాండ్…

శంషాబాద్ : ఆదివాసీ బిడ్డ ఊకె శిరీష దారుణ హత్య ఘటనలో ఆమె పనిచేస్తున్న శంషాబాద్ లోని తుక్కుగూడ ప్రైమ్ కేర్ హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన నాయకుడు సయ్యద్ ఇస్మాయిల్ డిమాండ్ చేశారు. హాస్పిటల్ యాజమాన్యం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతోనే ఆమె హత్య జరిగిందని తెలిపారు. ఆదివారం శంషాబాద్ డీసీపీ ఆఫీస్ లో పార్టీ నాయకులతో కలిసి ఊకె శిరీష హత్య ఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ మాట్లాడుతూ, శిరీష హత్యకు కారణమైన ప్రైమ్ కేర్ హాస్పిటల్ ను వెంటనే సీజ్ చేసి యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత కొన్ని రోజుల క్రితం ములకలపల్లి మండలంలోని చౌటిగూడెంలో ఊకె శిరీష కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమ బిడ్డ హత్యకు హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యమే ఆమె కుటుంబ సభ్యులు వివరించారని తెలిపారు. శిరీష కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు హాస్పిటల్ యాజమాన్యంపై ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆదివాసీ బిడ్డ శిరీష మృతితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాటు వెంటనే హాస్పిటల్ ను సీజ్ చేయాలని కోరారు. తమ పార్టీ అధ్యక్షులు కవిత శిరీష కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన సమయంలోనే సీఎం స్పందించి శిరీష మరణంపై విచారణకు జ్యుడీషియల్ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నట్టు ప్రకటించినా ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు ప్రారంభం కాలేదన్నారు. ఆదివాసీ యువతి హత్య విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించటం సరికాదన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు కంచర్ల శివారెడ్డి, ఆదివాసీ విభాగం నాయకుడు లోకిని రాజు, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నవీన్ గౌడ్, మహేశ్వరం నియోజకవర్గ ఇంఛార్జ్ కోల శ్రీనివాస్, పార్టీ నాయకురాలు భవాని తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులే మేలు..

0
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులే మేలు.. చత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: పర్యావరణ పరిరక్షణ సందేశంతో చత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి...

11వ రాష్ట్ర సబ్-జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలుర పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టుకు ద్వితీయ స్థానం…

0
11వ రాష్ట్ర సబ్-జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలుర పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టుకు ద్వితీయ స్థానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో ఈ నెల 11 నుంచి 13వ...

పీఓపీ గణపతి వద్దు మట్టి గణపతి ముద్దు…

0
పీఓపీ గణపతి వద్దు మట్టి గణపతి ముద్దు... శ్రీ నారాయణ హైస్కూల్ ఆధ్వర్యంలో నేడు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా పీఓపీ గణపతి విగ్రహాలకు...

కొలువైన గణనాథుడు.. పూజలకు భారీ ఏర్పాట్లు…

0
కొలువైన గణనాథుడు.. పూజలకు భారీ ఏర్పాట్లు కామారెడ్డి పట్టణంలోని గాంధీగంజ్‌లో ఆకట్టుకుంటున్న వినాయక మండపాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని గాంధీగంజ్ ప్రాంతంలో వినాయక మండపాలను భక్తిశ్రద్ధలతో,...

ధర్పల్లి లో సహారా బాధితులకు డబ్బులు వెంటనే చెల్లించాలని రౌండ్ టేబుల్ సమావేశం…

0
ధర్పల్లి లో సహారా బాధితులకు డబ్బులు వెంటనే చెల్లించాలని రౌండ్ టేబుల్ సమావేశం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో సహారా ఇండియా సంస్థలో పేద...

Translate »
error: Content is protected !!