నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
విఘ్నాలను తొలగించే ఆది దేవుడైన వినాయకుడి ఉత్సవాలను ప్రజలంతా శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. గణేష్ చతుర్థి ప్రతి ఇంటా సుఖసంతోషాలను నింపాలని, గణనాథుడి కృపాకటాక్షాలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు.
అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజించాలని ఎమ్మెల్యే సూచించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

























