గుంతలమయంగా మారిన సిరిసిల్ల రహదారి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం
ప్రయాణికులకు తప్పని తిప్పలు.. మరమ్మతులు చేపట్టాలని ప్రజల విజ్ఞప్తి
కామారెడ్డి :పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది.
రోడ్డంతా గుంతలతో నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు ప్రమాద భయంతో ప్రయాణిస్తున్నారు.
ద్విచక్రవాహనదారులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వర్షం పడిన సమయంలో గుంతల్లో నీరు నిలిచి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది.
రాత్రి వేళల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ రహదారిపై ప్రయాణం చేయడం ఎంతో కష్టంగా మారిందని ప్రజలు వాపోతున్నారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని వారు కోరుతున్నారు.
గుంతలను పూడ్చి రహదారి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

























