భక్తిశ్రద్ధలతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం
కామారెడ్డి: పట్టణంలోని గంజివర్తక సంఘం హనుమాన్ ఆలయ ధర్మశాలలో హిందూ వాహిని ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హిందూ వాహిని సభ్యులు భగవద్గీత శ్లోకాలను పారాయణం చేసి, వాటి అర్థాలను భక్తులకు సులభంగా వివరించారు.
మానవుడు సన్మార్గంలో ఎలా జీవించాలి, భగవంతునిపై భక్తి ఎలా ఉండాలి, తోటి వారితో ఎలా మెలగాలి, దేవుని ఆరాధనను ఏ విధంగా చేయాలి వంటి అంశాలపై ఆధ్యాత్మిక సందేశాలను అందించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో హిందూ వాహిని కుటుంబ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమంతుని నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని భక్తిమయంగా మార్చారు.

























