సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎర్రం లింగం….
త్రిశూల్ న్యూస్ నందిపేట్ మండల్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్
నందిపేట్ సెప్టెంబర్ 12 త్రిశూల న్యూస్ : నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్ర గ్రామ సర్పంచ్ ఎర్రం లింగం ను ఉన్నత పదవి వరించింది. నందిపేట సర్పంచ్ గా ఎన్నికైన సిలిండర్ లింగం నందిపేట మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా కొనసాగుతూ.. నేడు రాష్ట్ర సర్పంచ్ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. హైదరాబాదులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తెలంగాణరాష్ట్ర సర్పంచ్ల సంగం అధ్యక్షులు సౌధాని భూమన్న యాదవ్ చేతుల మీదుగా ఆయనకు ఎన్నిక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచుల సంఘం కార్యదర్శిగా నన్ను నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులకు, జిల్లా అధ్యక్షులకు నాతోటి సర్పంచులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, నాపై నమ్మకం ఉంచి ఈ పదవిని కట్టబెట్టినందుకు రాష్ట్రంలో ఎన్నికైన సర్పంచుల సమస్యలపై పోరాడుతూ వారి అభివృద్ధి కొరకై పాటుపడతానని, పంచాయితీలే స్థానిక ప్రభుత్వాలు అన్న నినాదంతో…. గ్రామ అభివృద్ధే దేశాభివృద్ధి అన్న లక్ష్యంతో పని చేస్తానని తెలిపారు. ఎర్రం సిలిండర్ లింగం రాష్ట్ర కార్యదర్శి గ నియమితులవడంతో నందిపేట గ్రామ ప్రజలు శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు.

























