మెంట్రాజ్‌పల్లి రైతుల కష్టాలు.. కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు!
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామంతో పాటు వేస్లీ నగర్ తండా, నాక తండా రైతులు తీవ్ర విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ అవసరాలకు సరైన సమయంలో విద్యుత్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమ సమస్యలను అధికారులు అర్థం చేసుకుని వ్యవసాయానికి నిరంతరాయంగా, నిర్ణీత సమయాల్లో విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు మెంట్రాజ్‌పల్లి 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు.
పెద్ద సంఖ్యలో రైతులు ఈ ఆందోళనలో పాల్గొని, కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే విద్యుత్ సమస్యను పరిష్కరించాలని వారు అధికారులను కోరారు.

























