సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలి…
ఇందూరు: సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు.
శ్రీ ధన్‌పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రెండో రోజు నగరంలోని మార్వాడిగల్లిలో ఉన్న కార్యాలయంలో వినాయక ఉత్సవ నిర్వాహకులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం తమ ట్రస్టు ద్వారా గణపతి మండపాలకు సహకారం అందిస్తున్నామని తెలిపారు. గత ఏడాది 725 మండపాలకు సహకారం అందించగా, ఈ ఏడాది సుమారు 800 మండపాలకు తమ వంతు సహాయం అందిస్తామని పేర్కొన్నారు.
వినాయకుడు కేవలం ఒక పండుగకు సంబంధించిన దేవుడు కాదని, సంస్కృతి, సనాతన ధర్మం, ఐక్యతకు ప్రతీక అని ఎమ్మెల్యే అన్నారు. గణపతి ఉత్సవాల ద్వారా ప్రజలంతా ఒకచోట చేరి సామూహిక ఐక్యతను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి మండపం వద్ద బాలగంగాధర్ తిలక్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
అలాగే ఆదివారం సాయంత్రం 5 గంటలకు కిసాన్ షాపింగ్ మాల్ వద్ద మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

























