Homeతెలంగాణనిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 6 వారాల్లో 1,784 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు...

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 6 వారాల్లో 1,784 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 12 వరకు ఆరు వారాల పాటు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 1,784 కేసులు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐపీఎస్ తెలిపారు.

నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వారిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టుల్లో హాజరుపరచగా.. 124 మందికి వారం రోజుల జైలు శిక్ష విధించారు. మిగిలిన వారికి కలిపి రూ.1 కోటి 45 లక్షల 20 వేల జరిమానా విధించినట్లు కమిషనర్ వెల్లడించారు.

మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసే అవకాశం ఉందన్నారు. మైనర్లు మద్యం సేవించి వాహనం నడిపితే మైనర్‌తో పాటు వాహన యజమానిపై కూడా కేసు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మొదటిసారి పట్టుబడితే రూ.10 వేల జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష, రెండోసారి పట్టుబడితే రూ.15 వేల జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం…

0
మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం వినూత్న రీతిలో విద్యార్థుల పర్యావరణ అవగాహన కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం బీబీపేట: పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మట్టి గణపతులను పూజించాలని విద్యార్థులు...

యూనివర్సిటీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం…

0
యూనివర్సిటీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ రాష్ట్రంలోని యూనివర్సిటీలు తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా.. వాటి సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పీడీఎస్‌యూ నిజామాబాద్ జిల్లా...

సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలి…

0
సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలి... ఇందూరు: సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. శ్రీ ధన్‌పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రెండో...

సీతాయిపేట్ శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బిజెపి నేత…

0
సీతాయిపేట్ శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బిజెపి నేత... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని సీతాయిపేట్ గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి...

మెంట్రాజ్‌పల్లి రైతుల కష్టాలు.. కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు!

0
మెంట్రాజ్‌పల్లి రైతుల కష్టాలు.. కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు! త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామంతో పాటు వేస్లీ నగర్ తండా, నాక తండా రైతులు తీవ్ర విద్యుత్...

Translate »
error: Content is protected !!