ధర్పల్లి: SIR ప్రత్యేక శిబిరంలో 297 నోటీసుల క్లియరెన్స్…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన SIR ప్రత్యేక శిబిరంలో ఓటర్ల పేర్లలో అచ్చు తప్పులు, ఇతర వివరాల సవరణ ప్రక్రియ కొనసాగుతోంది.
ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో మొత్తం 524 నోటీసులు జారీ చేయగా.. రెండు రోజుల్లో 297 నోటీసులకు క్లియరెన్స్ ఇచ్చినట్లు ధర్పల్లి తహశీల్దార్ శాంత తెలిపారు. ధర్పల్లిలోని నాలుగు పోలింగ్ కేంద్రాల పరిధిలో 2 వేలకు పైగా నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
నోటీసులు అందుకున్న ఓటర్లు తమ వివరాల సవరణ కోసం సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించాలని తహశీల్దార్ సూచించారు.

























