ధర్పల్లి ZPHSలో విద్యార్థులకు యోగాభ్యాసం
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు ప్రతిరోజూ యోగాభ్యాస తరగతులను నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందించేలా యోగాసనాలు, ప్రాణాయామం వంటి సాధనలను నేర్పిస్తున్నారు.
ప్రతిరోజూ యోగాభ్యాసం చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని ప్రధానోపాధ్యాయులు మురళీధర్, ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. యోగాభ్యాసంపై విద్యార్థులు ఆసక్తి కనబరుస్తూ ఉత్సాహంగా తరగతుల్లో పాల్గొంటున్నారు.

























