బీసీలకు అండగా ఉంటాం ధర్మపోరాట దీక్షకు మద్దతు..
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం
కామారెడ్డి పట్టణంలో జాతీయ జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధర్మపోరాట దీక్షకు మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి–శ్రీనివాస్ మద్దతు తెలిపారు.
శుక్రవారం దీక్షా శిబిరాన్ని సందర్శించిన మున్సిపల్ చైర్పర్సన్.. బీసీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం దీక్ష చేస్తున్న బీసీ సంఘాల నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు, సాప శివరాములు, కుంబాల లక్ష్మణ్ యాదవ్, సిద్ధరాములు, మల్లన్న, రాజయ్య, గణేష్ నాయక్, ఎల్లయ్య, వెంకటస్వామి, హాజీజ్ శ్రీనివాస్, తాహెర్, ప్రభు, అరుణ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

























