ఇంద్రానగర్ తండా ఎంపీపీఎస్‌లో విద్యార్థులకు షూస్, సాక్స్ పంపిణీ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ఇంద్రానగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలో గల ఎంపీపీఎస్ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు నూతనంగా వచ్చిన షూస్, సాక్స్‌ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు షూస్, సాక్స్ అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాలావత్ బాలు, ఉపసర్పంచ్ మాలావత్ గోవింద్, పంచాయతీ కార్యదర్శి శ్రీహరి, శ్రీకాంత్, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్, గంగారెడ్డి పాల్గొన్నారు.

























