రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు తొర్లికొండ విద్యార్థి ఎంపిక…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
జక్రాన్‌పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండకు చెందిన విద్యార్థి ఎస్. రిషిధవన్ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు.
ఈ నెల 6న ఆర్మూర్‌లో నిర్వహించిన జిల్లా సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ ఎంపిక పోటీల్లో ఎస్. రిషిధవన్ చక్కటి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగా మోహన్ తెలిపారు.
ఈ నెల 11 నుంచి 13 వరకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని తిలక్ స్టేడియంలో నిర్వహించనున్న 11వ రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో రిషిధవన్ పాల్గొంటాడని తెలిపారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జక్రాన్‌పల్లి మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ పద్మ, ఉపసర్పంచ్ మహిపాల్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గంగాధర్, కార్యదర్శి భువనేశ్వర్, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

























