20న ప్రబోధ సాధన సంస్థ సమావేశం
జాతీయ పురస్కారాల గ్రహీతల తుది జాబితా ప్రకటన…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీమ్‌గల్: ప్రబోధ సాధన సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న నిర్వహించాల్సిన సమావేశం అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ సమావేశాన్ని ఈ నెల 20న భీమ్‌గల్‌లోని ప్రబోధ సాధన సంస్థ శాఖ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.ఎస్.ఆర్. ప్రబోధ సుమేర్ తెలిపారు.
ఈ సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో దేవన్‌పల్లిలో చేపట్టిన అభివృద్ధి, సేవా కార్యక్రమాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రతిష్టాత్మక ‘ప్రబోధ జాతీయ పురస్కారాలు’ అందుకోనున్న గ్రహీతల తుది జాబితాను ప్రకటించడంతో పాటు, పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశానికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, సంస్థ సభ్యులు, ఆహ్వానితులు నిర్ణీత సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎం.ఎస్.ఆర్. ప్రబోధ సుమేర్ కోరారు.

























