లక్ష్మీనారాయణను అభినందించిన ఉదయ్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ రాజేశ్వర్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం
కామారెడ్డి: ఎన్‌ఎండీసీ 42 కిలోమీటర్ల మారథాన్‌లో కామారెడ్డి జిల్లా తరఫున ప్రతిభ కనబరిచిన 46వ వార్డు కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మీనారాయణను ఘనంగా సన్మానించారు. లక్ష్మీనారాయణ 42 కిలోమీటర్ల మారథాన్‌ను 3 గంటల 54 నిమిషాల్లో పూర్తి చేసి ప్రతిభ చాటారు.
ఈ సందర్భంగా ఉదయ్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్, కోచ్, రిటైర్డ్ ఆర్మీ జవాన్ రాజేశ్వర్ ఇందిరాగాంధీ స్టేడియంలో లక్ష్మీనారాయణను సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ.. లక్ష్మీనారాయణ సాధించిన విజయం అభినందనీయమని అన్నారు. పట్టుదల, క్రమశిక్షణతో కృషి చేస్తే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని పేర్కొన్నారు. యువతకు లక్ష్మీనారాయణ మంచి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
భవిష్యత్తులో ఆయన మరెన్నో విజయాలు సాధించాలని రాజేశ్వర్ అభిలషించారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న యువకులు పాల్గొన్నారు.

























